Sunday, November 6, 2022

సాహితీ పిల్లలమర్రి జలజం సత్యనారాయణ

 సాహితీ పిల్లలమర్రి జలజం//దండు వెంకట్రాములు

------------

కవిత్వం నేనెలా చెప్పను...

సూర్యుడిని చంద్రుడిని వర్ణించనా....

లేక కొత్త తార కనుక్కోనా...

దేని గురించి వర్ణించిన అదే స్థాయి

మన తెలుగు అనువాద సాహిత్య దిగ్గజం జలజం

జలజం గారి కలం నుండి ...

తెల్లటి కాగితంపై నల్లటి అక్షరాలతో 

అనువాదం ఒక్కటే జరగలే...

ఆ అక్షరాలు ఇంద్రధనస్సుల

తన అర్థాన్ని విస్తరించుకొని 

ప్రజల అభివ్యక్తికి దగ్గరయ్యాయని చెప్పనా

ఇంతకు నేను కవిత్వం ఏ దృష్టిలో చెప్పను...

రాజకీయ విశ్లేషణల్లోను

రాజీ పడని మనస్తత్వం

వాజ్పేయిలోని గెలుపు మొరట్టుతత్వం

వివరించిన రాజకీయకవి మరో వాజ్పేయి మనస్తత్వమని అని చెప్పనా....

ఇంతకు నేను కవిత్వం ఎలా చెప్పను ...

పొనీ ఒక కబీర్ గీత ,ఆనల, వేదన,శిఖరం

అచ్చు ముద్రితాలను... చూపించి

 ఈ పుస్తకాల్లో

ఉన్నదే జలజం కవిత్వమని చెప్పనా

ఎంత ఆలోచించినా ...

ఇంతకీ నేను కవిత్వం ఎలా చెప్పను...

అన్నదే నన్ను తోలుస్తున్న ప్రశ్న...

తెలంగాణలో కవులున్నారు 

కవులను పోషించేవారు ఉన్నారు

అని ఈ కాళోజి హాల్ ని చూపించి

జలజం గారు కవిపోషకుడు అని

పాలమూరు గడ్డమీద ఎందరో కవులను సృష్టించిన

మరో సూరవరం ప్రతాపరెడ్డి అని చెప్పనా..

లిటిల్ స్కాలర్ విద్యార్థుల 

చిరునవ్వులను చూపించి

ఠాగూర్ లా శిఖరాగ్రం చేరిన

ఈ సాహితీవేత్తను

విద్యావేత్త అని చెప్పనా.....


పాలమూరు అంతట నూతన కవులకు

దారి చూపించి..పిల్లల మర్రి చెట్టులా

తన అస్తిత్వాన్ని ఊడలుగా విస్తరించిన

జలజం మహోన్నతత్వాన్ని

ఇంతకీ నేను ఏ దృష్టిలో చెప్పను....

ఏదో ఒక దృష్టిలో నన్ను నేను నిరూపించుకోవడానికి చెప్తే మీరంగీకరిస్తారా?

 ఈ పాలమూరు గడ్డపైన 

 నిరంతరం భువన విజయాన్ని...

 చూపించి... సాహితీ లోకంలో 

 మచ్చలేని శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పనా...

ఉర్దూ హిందీ ఆంగ్లం సంస్కృతం

ప్రతి భాషలోనూ... అందే వేసిన చేయి అని

బహుభాషా కోవిదుడు అనువాద సాహిత్య ప్రేమికుడు

ఈ గడ్డపైన మరొ పివీ నరసింహారావు అని చెప్పనా

నేను ఒక్క దృష్టి కోణంలో చెప్తే

నా కవిత్వం తప్పు అని..

నా అంతరాత్మకు తెలుస్తుంది..

మరో కోణం వివరించడానికి మొలుస్తుంది...

జలజం గారి గురించి

ఎన్ని చెప్పినా ... ఎంత చెప్పినా

వివరించడానికి 

ఊడలుగా విస్తరించి ఉన్న 

సాహితీ పిల్లల మర్రే.

Fake Account

  శీర్షిక:Fake Account మనిషి మాయమైతుండు మాయ లాంటి ఆత్మోక్కటి నిజమవుతుందంటే మీరు నమ్ముతారా...? ఇప్పుడు మనిషి Profile లో 'మనిషి' తనమే ...